సురక్షిత నీటిసరఫరాలో తెలంగాణ అగ్రగామి: కేటీఆర్

123
cm kcr

సీఎం కేసీఆర్ విజన్‌,ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల కృషివల్లే సురక్షిత నీటి సరఫరాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. 98.31 శాతం ఆవాసాలకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తెలంగాణ‌ మొదటిస్థానంలో నిలిచింద‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్.

కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్‌ జీవన్‌ మిషన్‌ వెల్లడించిన గణాంకాల్లో తెలంగాణ మొదటి స్ధానంలో నిలవగా నల్లా కనెక్షన్లలో దేశసగటు 27.28 శాతం ఉంది.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ 74.16 శాతంతో 5వ స్ధానంలో ఉండగా 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడు, 79.78 తో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయి.