మొక్కలు నాటిన సింగరేణి ఏరియా జీఎం

376
green challenge
- Advertisement -

రాజ్య సభ్యులు సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని సింగరేణి ఏరియా జిఎం ఈసిహెచ్ నిరీక్షన్ రాజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.

కె.టి.కె 8 ఇంక్లైన్ వెయ్యి క్వాటర్స్ న్యూ కమ్యూనిటీ హాల్ ఆవరణంలో వద్ద మూడు మొక్కలు నాటారు నిరీక్షన్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకుంటున్న చొరవ అభినందనియం అన్నారు.

సింగరేణి ప్రాంతాల్లో ప్రతీ సంవత్సరం హరితహారం లో బాగంగా కోటి మొక్కలు నాటుతారు . ఇతర ప్రాంతాలతో పోల్చితే సింగరేణి ప్రాంతాల్లో 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయి . కావున సింగరేణి ప్రాంతానికి గ్రీన్ ఛాలెంజ్ గోల్డ్ ఛాలెంజ్ గా బావించాలి అని అన్నారు . దీనిని అందరూ స్వీకరించి మూడు మొక్కలు నాటలి అని పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా జీఎం నీరిక్షన్ రాజ్ గారు మరో ముగ్గురిని నామినేటెడ్ చేశారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ డి.వై.సి.యం.ఓ డాక్టర్ పద్మజ, ఆర్.జి 3 రామగుండం జనరల్ మేనేజర్ సూర్యనారాయణ , తాడిచెర్ల ఏ.యం ఆర్ ఓపెనకాస్ట్1 ప్రభాకర్ రెడ్డి లను మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -