‘ట‌క్ జ‌గ‌దీష్’ డ‌బ్బింగ్‌ ప్రారంభం..

177
Nani
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ ‘ట‌క్ జ‌గ‌దీష్. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసినట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (జ‌న‌వ‌రి4) నుండి ప్రారంభ‌మయ్యాయి. ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నారు.

‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌న్ ముసులూరి,
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌,
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

- Advertisement -