సింగరేణికి రాష్ట్ర స్థాయి అవార్డు..

470
N Balaram IRS
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారుగా సింగరేణి మరో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకుంది. హైద్రాబాద్‌లో బుధవారం (జూలై 24వ తేదీ) సాయంత్రం జరిగిన 159వ ఇన్ కం ట్యాక్స్ డే ఉత్సవాలో ఈ అవార్డును ముఖ్య అతిథిగా హాజరైన నల్సార్ యూనివర్శిటీ వైస్ ఛాన్సర్ డాక్టర్ ఫైజాన్ ముస్తాఫా నుండి సింగరేణి తరపున డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం ఐ.ఆర్.ఎస్. అందుకొన్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రా ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ ఎన్.శంకరన్ అధ్యక్షత వహించగా అతిథులుగా డి.జి. ఇన్వెస్టిగేషన్ ఆర్.హెచ్.పాలీవాల్, చీఫ్ కమీషనర్ అతుల్ ప్రణయ్ లు పాల్గొన్నారు. సింగరేణితో పాటు అవార్డు అందుకున్న అత్యధిక ట్యాక్స్ చెల్లింపుదారులలో ఎన్.ఎం.డి.సి. సంస్థ, ఆంధ్రా బ్యాంకు లు ఉన్నాయి.

singeni award

ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర, దేశ ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తున్న ప్రభుత్వ సంస్థలో సింగరేణి ప్రముఖమైనదని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో గల పరిశ్రమల్లో సింగరేణి సంస్థ ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుల్లో ఎప్పుడూ ముందుంటూనే ఉందన్నారు. సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా అత్యధిక ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారుల్లో అగ్రస్థానాల్లో ఉంటూ వస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్టంగా 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 25,828 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ నేపథ్యంలో కంపెనీ 750 కోట్ల రూపాయల ఇన్ కం ట్యాక్స్ చెల్లించింది. ఇంత పెద్దమొత్తంలో ఇన్ కం ట్యాక్స్ చెల్లించి దేశ ప్రగతికి దోహదపడిన ఉత్తమ కంపెనీల్లో ఒకటిగా గుర్తిస్తు ఈ అవార్డును ఇన్ కం ట్యాక్స్ ఉన్నతాధికారులు సింగరేణికి అందించారు.

singareni

అవార్డు అందుకున్న సందర్భంగా డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం మాట్లాడుడూ.. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశంలో సిఅండ్‌ఎం.డి. ఎన్.శ్రీధర్ సారథ్యంలో గత ఐదేళ్లలో అత్యధ్భుత ప్రగతిని సాధించిందన్నారు. కంపెనీ టర్నోవర్ 11,928 వేల కోట్ల రూపాయల నుండి 116 శాతం వృధ్దితో 25,828 కోట్లకు చేరిందని, లాభాలు 419 కోట్ల రూపాయల నుండి 282 శాతం వృద్ధితో 1600 కోట్ల రూపాయలకు పెరిగాయనీ తద్వారా అత్యధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గత ఐదేళ్ల కాలంలో 25,687 కోట్ల రూపాయలను వివిధ రకాల ట్యాక్సుల రూపంలో చెల్లించగలిగామని వివరించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కంపెనీ ఇన్ కం ట్యాక్స్ రూపంలో 750 కోట్లు చెల్లించగలిగిందని తద్వారా అత్యధిక ట్యాక్స్ చెల్లింపుదారుల్లో ఒకరుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -