సింగరేణి భవన్ లో బతుకమ్మ ఉత్సవాలు

433
singaeni bathukamma
- Advertisement -

సింగరేణి భవన్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసందర్బంగా ఆంథోనీ రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ కుటుంబ సభ్యులందరు క్షేమముగా ఉండాలని స్త్రీలందరు చేసుకొనే ఈపండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ప్రాశస్త్యం పొందిందని , ప్రపంచ దేశాలలోని తెలంగాణ వారందరు ఈపండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారని ఆయన తెలియజేశారు .

ఈ ఉత్సవాలలో ప్రతీ రోజు మహిళా ఉద్యోగులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు . ఈ వేడుకలో సింగరేణి భవన్ మహిళా ఉద్యోగులు , ఔట్సోర్చింగ్ మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇంకా ఎన్.వి . కె . శ్రీనివాస్ , దుండే.వెంకటేశం , భాస్కర్ , అరవింద్ , విజయేందర్ రెడ్డి , మహేష్ మరియు ఇతర అధికారులు ప్రారంబ పూజా కార్యక్రమములో పాల్గొన్నారు .

- Advertisement -