అమెరికాలో మరో జాత్యాహంకార దాడి జరిగింది. కెంట్ ప్రాంతంలో ఓ సిక్కు యువకుడిపై అమెరికన్ కాల్పులు జరిపాడు. మా దేశం నుంచి వెళ్లిపో అంటూ అరుస్తూ అతనిపై కాల్పులకు పాల్పడ్డాడు. అమెరికన్ కాల్పుల్లో సిక్కు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన కెంట్ పోలీసులు..యువకున్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ లపై వరుసదాడుల నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారతీయులు భయంతో బతుకుతున్నారు. తాజాగా మరో విద్వేష దాడి జరగడంతో బెంబేలెత్తుతున్నారు.
రెండు వారాల క్రితం శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై తెల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. కన్సస్ లో జరిగిన ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి, మరణించాడు. మరో తెలుగు యువకుడు అలోక్ కూడా గాయపడ్డాడు. ఈ ఘటన మరువక ముందే శనివారం నాడు హర్నీష్ అనే గుజరాతీ వ్యాపార వేత్తపై కాల్పులు జరిగాయి. దీనిపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తోంది.