‘తెలుసు కదా’ అంటున్న సిద్దూ

59
- Advertisement -

డీజే టిల్లుతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ హీరోగా మారిపోయారు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. డీజే టిల్లు సీక్వల్‌తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా ,దీంతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో నీరజ దర్శకురాలిగా పరిచయం అవుతుండగా రచయిత కోన వెంకట్ కి స్వయానా సోదరి. ఇక ఇవాళ సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు. ‘తెలుసు కదా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథ నేపథ్యంలో కథ సాగనుండగా స్నేహం, కుటుంబం, త్యాగం వంటి అంశాలు హైలైట్ గా ఉంటాయట.

సిద్దూ సరసన కేజీఎఫ్‌ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాహీరోయిన్స్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Also Read:బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో.. ప్రత్యర్థుల్లో గందరగోళం!

- Advertisement -