- Advertisement -
సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయం దసరాకు సిద్ధం అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను స్ధానిక నేతలతో కలిసి పరిశీలించిన హరీష్ …సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్ణిస్తున్న టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం మోడల్ గా నిల్వనుందన్నారు.
గ్రౌండ్ ప్లోర్ తో పాటు మొదటి అంతస్థు తో కార్యాలయ భవన్ నిర్మాణం జరుగుతుంది. 1500 మంది పార్టీ శ్రేణులు మిటింగ్ లో పాల్గొనేలా మిటింగ్ హల్ అద్బుతంగా నిర్మాణం జరిగింది..విశాలమైన పార్కింగ్ , మోడల్ కిచెన్ షేడ్, టాయిలెట్స్ నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలు గ్రౌండ్ ప్లోర్ వరకే నిర్మాణం చేపడితే మంత్రి హరీష్ రావు చొరవ తో సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయం మొదట అంతస్థు తో ఒక మోడల్ గా , మినీ తెలంగాణ భవన్ గా రాష్ట్రంలో మోడల్ గా నిలవనుంది.
- Advertisement -