నిమ్స్‌లో కోవిడ్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించిన సీపీ..

55

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చేరిన కోవిడ్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితి, ఇతర వివరాలను కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ డెస్క్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నుంచి ఆస్పత్రికి చేరేవరకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సీపీ చెప్పారు. జిపిఎస్ సిస్టం ద్వారా ఆక్సిజన్ ను తరలిస్తున్న వాహనాలు ఏ ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఇతర సమస్యలు తలెత్తకుండా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా విజృంభన నేపథ్యంలో నగర ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సిపి విజ్ఞప్తి చేశారు.