స్వచ్ సర్వేక్షన్ లో మెరిసిన సిద్దిపేట

24
- Advertisement -

మన సిద్దిపేట… మన అభివృద్ధి… మన హరీష్ రావు అనే మాటకు మరో సారి సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయి లో మెరిసింది. సిద్దిపేట పేరు లేనేది అవార్డు అంటూ ఉండదు అనే ఎమ్మెల్యే హరీష్ రావు గారి మాట ఎప్పటికి నిదర్శనం అని చూపుతుంది మన సిద్దిపేట… ప్రతి ఏటా ప్రకటించే స్వచ్ సర్వేక్షన్ అవార్డు ల్లో నేడు జాతీయ స్థాయి లో సిద్దిపేట పట్టణం మెరిసింది. సిద్దిపేట అంటే స్వచ్చత… సిద్దిపేట అంటే శుభ్రత.. సిద్దిపేట శుద్ధిపేట అనే మాటలకు ఈ అవార్డు లే నిదర్శనం… చెత్త సేకరణ లో సమర్థవంతంగా నిర్వహణ కు ..తడి, పొడి, హానికర చెత్తలను వేరు చేయడం… పారిశుధ్య నిర్వహణ ఫై ప్రజల్లో చైతన్యం తేవడం పట్ల… ముఖ్యం గా సిద్దిపేట పట్టణం లో సిటీజన్స్ ఫీడ్ బ్యాక్ లో అగ్రస్థానంలో నిలిచింది జాతీయ స్థాయి లో మెరిసింది మన సిద్దిపేట… హరీష్ రావు గారి నిత్య పర్యవేక్షణ, నడుస్తు చెత్త ను వేరుదాం అని ప్రజల్లో గొప్ప చైతన్యం తెచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్, అధికారుల, సిబ్బంది పని తీరు కు ఇది గొప్ప ప్రశంస… దేశం లో జాతీయ స్థాయి లో గ్రేటర్ హైదరాబాద్… జాతీయ స్థాయి జోనల్ విభాగం లో లక్షకు పైగా జనాభా ఉన్న మన సిద్దిపేట పట్టణం స్వచ్ సర్వేక్షన్ లో అగ్రస్థానంలో నిలిచింది…

జాతీయ స్థాయి లో… రాష్ట్ర స్థాయి లో అవార్డు ప్రకటించారు అంటే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు అంటూ ఉండదు…. అందుకు నిదర్శనం నేడు ప్రకటించిన అవార్డు నే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు. సిద్దిపేట ప్రజలు చెత్త సేకరణ లో… ప్లాస్టిక్ రహిత పట్టణం గా మార్చడం లో.. పారిశుధ్య నిర్వహణ లో వారు భాగస్వామ్యం తోనే సిద్దిపేట పేరు ఎల్లలు దాటుతోందని, ప్రజల సహకారం గొప్పదన్నారు.. ప్రజల్లో చైతన్యం తేవడం లో ప్రజాప్రతినిధులు ( కౌన్సిలర్స్ ) చూపించే చొరవ, మున్సిపల్ అధికారులు, సిద్దిపేట పని తీరు కు దక్కిన అవార్డు అని ఈ సందర్బంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు… ఇదే స్ఫూర్తి తో మరిన్ని అవార్డు లు సాధించేలా కృషి చేయాలన్నారు.

Also Read:అత్యంత సంపన్నుడిగా అదాని..

- Advertisement -