- Advertisement -
సోమవారం సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. కాగా వెంకట్రామిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌గా సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేశాను. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 26 సంవత్సారాలు అన్ని ప్రభుత్వాల్లో పని చేశా.. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడు చేరాలనే ఆదేశాలు ఇంకా రాలేదు. ఆదేశాలు వచ్చాక టీఆర్‌ఎస్‌లో చేరుత అని.. కేసీఆర్ మార్గ నిర్దేశం ప్రకారం పనిచేస్తా అన్నారు వెంకట్రామిరెడ్డి.
- Advertisement -