వార్నర్‌పై సూపర్‌ స్టార్‌ మహేష్‌ ప్రశంసలు..

103
Mahesh Babu
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా ఆవిర్భవించింది. ఆస్ట్రేలియా విజయానికి పునాది వేసింది ఓపెనర్ డేవిడ్ వార్నర్. కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మరోవైపు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు కూడా ప్రశంసించారు. ఆసీస్ ఉక్కు సంకల్పం ఎలాంటిదో దుబాయ్ లో కళ్లకు కట్టినట్టు కనిపించిందని పేర్కొన్నారు. “టీ20 వరల్డ్ కప్-2021 చాంపియన్స్ గా నిలిచినందుకు ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. మిత్రమా డేవిడ్ వార్నర్… ఏం చెప్పమంటావు నీ గురించి? నిజంగా నువ్వు లెజెండ్!” అంటూ కొనియాడారు.

- Advertisement -