ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. మొత్తం రూ.182 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35% పెరుగుదల.
ఈ ఆలయం రూ.155 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంగా రూ.182 కోట్లు వచ్చాయి — అంటే రూ.27 కోట్లు అధికం. గత సంవత్సరం (2024-25)లో రూ.133 కోట్ల ఆదాయం వచ్చింది.
భారతదేశంలో బంగారం ధరలు 2025లో 10 గ్రాములకు రూ.90,000 దాటడం వల్ల, భక్తులు ఇచ్చే బంగారు కానుకలు కూడా విలువగా పెరిగాయి. 2024-25లో గుడి పాడ్వా సందర్భంగా జరిగిన బంగారం, వెండి వేలంలో రూ.1.33 కోట్లు వచ్చాయి. ఇది గత ఏడాది రూ.75 లక్షలతో పోలిస్తే దాదాపు రెండింతలు.
ఈ ఆలయంలో ప్రతిరోజూ సుమారు 10,000 లడ్డూలు భక్తులకు పంపిణీ అవుతాయి. లడ్డూలు, కొబ్బరి బర్ఫీ వంటి ప్రసాదాల విక్రయం కూడా ప్రధాన ఆదాయ వనరు. ఈ డబ్బును సిద్ధివినాయక ట్రస్ట్ సమాజ సేవకు పెద్దపీట వేస్తోంది.
Also Read:‘గాయపడ సింహం..’బ్రైడ్ సాంగ్’
పేద రోగులకు రూ.36 కోట్లు సహాయం చేయగా ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.24 కోట్లు , డయాలిసిస్ కేంద్రానికి రూ.2.6 కోట్లు, రైతుల పిల్లలకు రూ.1 కోటి స్కాలర్‌షిప్ ఇచ్చారు. అదనంగా, “శ్రీ సిద్ధివినాయక భాగ్యలక్ష్మి యోజన” కింద మహిళా శిశువులకు డిపాజిట్ పథకం కూడా అమలు చేస్తున్నారు.

