అమెరికా–ఇరాన్ యుద్ధ పరిస్థితుల మధ్య, అమెరికా ఆర్మీ చీఫ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కోరడం కీలక పరిణామంగా మారింది.ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ని వెంటనే పదవి నుంచి తప్పుకుని రిటైర్ కావాలని అమెరికా యుద్ధ కార్యదర్శి హెగసెత్ ఆదేశించారు.
పెంటగాన్ గురువారం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ నిర్ణయం వెనుక కారణాలను వెల్లడించలేదు. పెంటగాన్ ప్రతినిధి పార్నెల్ తెలిపిన ప్రకారం…. “జార్జ్ తన పదవి నుంచి వెంటనే రిటైర్ అవుతున్నారు అని పేర్కొన్నారు. అమెరికా ఇరాన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మరియు హెగ్సెత్ దృష్టికోణాన్ని అమలు చేసే కొత్త నాయకత్వాన్ని నియమించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. జనరల్ రాండీ జార్జ్ గల్ఫ్ వార్‌లో ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో సేవలందించారు.
జో బైడెన్ ప్రభుత్వంలో 2021–2022 మధ్య రక్షణ కార్యదర్శి ఆస్టిన్‌కు సీనియర్ మిలిటరీ సహాయకుడిగా పనిచేశారు. ఆగస్టు 2023 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.హెగ్సెత్ పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు డజనుకు పైగా ఉన్నత స్థాయి సైనికాధికారులను తొలగించారు. జార్జ్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టోపర్ లనెవె తాత్కాలిక ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తంగా, అమెరికా సైన్యంలో ఈ మార్పులు యుద్ధ పరిస్థితుల మధ్య కీలక మలుపుగా భావిస్తున్నారు.
Also Read:‘గాయపడ సింహం..’బ్రైడ్ సాంగ్’

