11 ఏళ్ల పాలన..సున్నామార్కులు!

7
- Advertisement -

11 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలు సున్నా మార్కులు వేశారని మండిపడ్డారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. కర్ణాటకకు కేంద్రం నుండి అన్యాయం జరిగిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కర్ణాటకకు అన్యాయం జరిగిందనీ తాము బీజేపీని అడిగినప్పుడు, త‌మ‌పై అపవాదుల‌ని నింద‌లు వేశార‌ని క‌ర్నాట‌క సీఎం గుర్తు చేశారు.

బీజేపీ పాల‌నలో ప్ర‌చార ఆర్భాటం త‌ప్పా ఏమి లేద‌ని …గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర పన్నుల వికేంద్రీకరణలో రాష్ట్రాలకు 50% వాటా ఉండాలని ఆయన అన్నారు.మోడీ..ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన దీనికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.

జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ..దేశంలో మోడీ రాజకీయ సంస్కృతిని మార్చారని.. ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చారని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్ల పరిపాలనను సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని చెప్పగా దీనికి కౌంటర్ ఇచ్చారు సిద్ధరామయ్య.

Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు

- Advertisement -