సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారు అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన సజ్జల…ఒక పథకం ప్రకారం దీనిపై ఆర్గనైజ్‌డ్ ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు గైడెన్స్‌లో వైయస్ఆర్‌సీపీపై దుష్ర్పచారం జరుగుతోందన్నారు.
తన వ్యాఖ్యల పట్ల కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు…సాక్షిటీవీ, వైయస్ఆర్‌సీపీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది అన్నారు. మూడు రోజులుగా సీఎం, పార్టీ యంత్రాంగం, ఎల్లో మీడియా దీనిపైనే దృష్టి… రెచ్చగొట్టి వివాదాన్ని సృష్టించి లబ్ధిపొందే కుట్ర జరుగుతోందన్నారు.
డిబేట్ అనేది నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రజంటేటర్ నడిపిస్తారు. దీనిలో ఏ అభిప్రాయాలు వ్యక్తం చేసినా అవి వ్యక్తిగతమైనవే. అవి హద్దులు మీరినప్పుడు ప్రజంటేటర్ దానిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు చేశారు. దానిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా తాను అన్న వ్యాఖ్యలు సరైనవేనంటూ ఎక్కడా కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు అన్నారు.
తెలుగుదేశం పార్టీ వారు కొద్దిమందిని పోగేసి, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆర్గనైజ్ చేసి, అధికారంలో ఉన్నామని తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి దీనిని వాడుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు వీడియో పెట్టి స్టేట్‌మెంట్, తరువాత పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్, ట్వీట్ పెట్టారు. ప్రజల మెదళ్ళో విషాన్ని నింపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.
Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు

