రాజ్యసభకు సిద్ధరామయ్య..సీఎం రేసులో!

7
- Advertisement -

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డు పడినట్లు సమాచారం. కాంగ్రెస్ పారట్ఈ వర్గాల సమాచారం ప్రకారం..కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తన పదవికి రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. సీఎం పదవికి డీకే శివకుమార్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్న వర్గాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు తలెత్తుతున్న రాజకీయ కుదుపులకు ఇది మరో పెద్ద మలుపుగా మారింది.

ఈ అంశంపై ఆలోచించి తన నిర్ణయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు తెలియజేయాలని మంగళవారం సిద్ధరామయ్యకు పార్టీ హైకమాండ్ సూచించినట్లు వర్గాలు తెలిపాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయన రాజీనామా ఉండే అవకాశం ఉందని సమాచారం.

అయితే రాజ్యసభకు వెళ్లడంపై సిద్ధరామయ్యకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలించాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. దానికి స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి, తనకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని చెబుతూనే ఈ ప్రతిపాదనపై ఆలోచించడానికి కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జూన్ 8 న జరగాల్సి ఉన్నందున అంతకంటే ముందే ఈ రాజీనామా ప్రక్రియ పూర్తవుతుందని వర్గాలు భావిస్తున్నాయి. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో చర్చలన్నీ కేవలం కర్ణాటక రాజ్యసభ స్థానాల గురించేనని, ఊహాగానాలను నమ్మవద్దని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ మార్పులకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు నివేదికలు వస్తూనే ఉన్నాయి.

Also Read:పెద్ది..చరణ్ విశ్వరూపం చూస్తారు!

అయితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. డీకేతో పాటు పరమేశ్వర్ సైతం సీఎం రేసులో ఉండగా ఎవరు సీఎం అవుతారోనన్న ఉత్కంఠ మాత్రం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. కర్ణాటకలో అధికార మార్పిడి జరుగుతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ సమావేశం కేవలం ఎన్నికల వ్యూహం మరియు అభ్యర్థుల ఎంపికకు మాత్రమే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -