- Advertisement -
కర్ణాటక సీఎం పీఠంపై చిక్కుముడి వీడింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపికకాగా ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను ఎంపిక చేసింది అధిష్టానం.
Also Read:తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన విస్తృత మంతనాల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చింది. 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు పార్టీ ఆదేశించగా ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకొనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
Also Read:కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ
పార్టీ కేంద్ర పరిశీలకులు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -