స్పార్క్L.I.F.Eలో సిద్ శ్రీరామ్

25
- Advertisement -

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు విక్రాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్షన్ చేశారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ప్రొడ్యూస్ చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ‘స్పార్క్’ను తెరకెక్కించారు.

మలయాళం బ్లాక్ బస్టర్ ‘హృదయం’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాల ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ ‘స్పార్క్L.I.F.E’కు సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు సినిమాలో మొదటి పాట ‘ఏమా అందం’ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

విశాఖలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. హేషం అందించిన అద్భుతమైన బాణీకి అనంత శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. హీరో విక్రాంత్, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మీద ఈ పాటను తెరకెక్కించారు. విజువలైజేషన్ కూడా ప్లజెంట్‌గా ఉంది. ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. నవంబర్ 17న ఈ సినిమా విడుదల చేయనున్నారు.

Also Read:కాంగ్రెస్‌లో వెంకటరెడ్డి కథ ముగిసిందా?

‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం ప్రతినాయకుడి పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:ఆకట్టుకున్న ‘మయాస్త్ర’

- Advertisement -