గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎస్‌ఐ సాయి రెడ్డి..

39
si sai reddy

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రన్ పల్లి మండలం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సాయి రెడ్డి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మూడు మొక్కలు నటవలసిన అవసరం ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇంకా విస్తరించి ప్రజలకు భావిభారత తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని తెలియజేశారు.