రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారితే..!

95
shyam sinha roy
- Advertisement -

నేచుర‌ల్‌స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగ‌రాయ్ . తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా టీజర్ విడుదలైంది.అడిగే అండలేదు… కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితే కడుపు చీల్చుకు పుట్టి, రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’ అంటూ హీరోను పరిచయం చేసిన తీరు, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియ‌న్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా చిత్రయూనిట్ చెబుతుంది. నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.శాను జాన్ వ‌ర్గీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -