నాకు విస్కీ అంటే చాలా ఇష్టంః శృతిహాసన్

438
shruthi
- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగువెలిగిన శృతిహాసన్ కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. తెలుగు, తమిళ్ , కన్నడలో శృతి హాసన్ నటించిన పలు సినిమాలు ప్లాప్ కావడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు శృతిహాసన్ గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత విడిపోయింది. దీంతో శృతి కొద్దిరోజులు బయటకు రాలేదు.

తాజాగా శృతి హాసన్ ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒకప్పుడు నేను రోజు మందు తాగేదాన్ని అని..కానీ ఇప్పుడు మానేసినట్లు తెలిపింది. నాకు విస్కీ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో తాగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు తమిళ్ లో నటిస్తుంది. తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. బలుపు సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేని ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -