శాంతిని నెలకొల్పేందుకు కృషిచేస్తా: రజనీకాంత్

273
rajinikanth
- Advertisement -

దేశంలో శాంతి,సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దేశంలో ప్రేమ,సమైక్యత,శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరల అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ట్వీట్ చేశారు.

అంతకముందు రజనీకాంత్‌తో పలువురు ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. వారితో భేటీ అనంతరం రజనీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక ఇటీవలె ఈశాన్య ఢిల్లీ ఘటనలపై రజనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘర్షణలను అదుపు చేయడంలో కేంద్రం తీరును తప్పుబట్టారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలని విమర్శలు చేశారు.

- Advertisement -