దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ (AOT) చిత్రం యొక్క తాజా షూటింగ్ షెడ్యూల్‌లో నటి శృతి హాసన్ చేరినట్లు సమాచారం. దర్శకుడు పవన్ సాధినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా షూటింగ్ ఇటీవలె ప్రారంభమైంది.
పీరియడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్‌లో శృతి హాసన్ జాయిన్ అయ్యారని సినీ వర్గాలు తెలిపాయి. అద్భుతమైన కథనం, సంపన్నమైన విజువల్స్ మరియు పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌ల కలయికగా ఈ చిత్రం ఉండబోతోంది.
ఈ సినిమాలో శృతి హాసన్ తన స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనుకునే ఒక ఆధునిక (కాంటెంపరరీ) అమ్మాయి పాత్రను పోషిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ తన ఎక్స్ (X) టైమ్‌లైన్‌లో నటి ఫస్ట్ లుక్ పోస్టర్లను పంచుకుంటూ.. ప్రతి విషయంలోనూ ఒక ట్రెండ్ సెట్టర్…. #AakasamLoOkaTara టీమ్ తరఫున @shrutihaasan కి పుట్టినరోజు శుభాకాంక్షలు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకునే పాత్రను ఇక్కడ చూడండి అని రాసుకొచ్చింది.
ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర అత్యంత నిర్ణయాత్మకమైన పాత్రను పోషించబోతోందని…ఆమె ఎంట్రీతో కథ ఒక కొత్త మలుపు తిరుగుతుందని సమాచారం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఈ డ్రామాకు మరింత వెయిట్ మరియు కొత్త డైమెన్షన్ తీసుకురానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
Also Read:చర్చలకు పిలిచి..పారిపోతారా?:కేటీఆర్

