శృతి డుమ్మా …చిరు కామెంట్స్

134
- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసినా సంక్రాంతి పోటీలో ఉన్న బడా సినిమాల గురించే డిస్కషన్ నడుస్తుంది. మొన్న ఒంగోల్ లో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హాట్టహాసంగా జరిగింది . నిన్న రాత్రి వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. అయితే ఈ ఈవెంట్ లో చిరు సరదా మాటలు వైరల్ అవుతున్నాయి.

మొన్న వీర సింహా రెడ్డి ఈవెంట్ లో మెరిసిన శృతి హాసన్ నిన్న వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి డుమ్మా కొట్టేసింది. దీంతో ఆమె గురించి మాట్లాడుతూ శృతి అనారోగ్యం వల్ల రాలేకపోయింది. ఒంగోల్ లో ఏం తిందో ? తెలియదు లేదా ఎవరైనా భయపెట్టారో ? అంటూ సరదాగా మాట్లాడారు మెగా స్టార్. ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శృతి పై చిరు కామెంట్స్ అంటూ వార్తలొచ్చాయి.

వాల్తేరు వీరయ్య కి సంబందించి ఇప్పటి వరకు ఒక్క ఈవెంట్ లో కూడా శృతి కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డుమ్మా కొట్టింది. పైగా బాలయ్య ఫంక్షన్ కి హాజరవ్వడం చిరు ఈవెంట్ కి స్కిప్ కొట్టడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : అంతా బికినీ మయమే!

ఇక్కడ ‘వారిసు’ ఉంటుందా?

మే 12న.. హను-మాన్ విడుదల

- Advertisement -