Shruti Haasan:నన్నింకా అలానే చూస్తున్నారు

60
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణతో కలిసి నటించడంపై వచ్చిన విమర్శలకు హీరోయిన్ శ్రుతిహాసన్‌ స్పందించారు. ఈ విమర్శలు నాకు వ్యక్తిగతంగా ఎదురైనవి కాదు, దర్శకుడు ఇచ్చిన పాత్ర వల్ల వచ్చినవే.. ఒక నటుడికి వయసుతో సంబంధం లేదు.. ఆ హీరోల పక్కన ఆమె సరిగ్గా సరిపోయిందని ఇప్పటివరకూ నన్ను ఎవరూ అనలేదు. కానీ నన్నింకా చిన్న పిల్లగానే చూస్తున్నారు దానికి నేను ఆనందిస్తున్నా అని శ్రుతిహాసన్‌ అన్నారు. ఏది ఏమైనా హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ తన నటనతో అలరించడానికి ఎప్పటికప్పుడు సన్నద్ధం అవుతూనే ఉంది.

నలభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ ముదురు బ్యూటీ ఇంకా తనలో నటన పై తపన, తాపత్రయం ఉన్నాయని, గ్లామరస్ రోల్స్ కు తాను ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇస్తానని.. ముఖ్యంగా ఎక్స్ పోజింగ్ కి తానూ ఎప్పుడు ముందు ఉంటానని శ్రుతిహాసన్‌ ఫిల్మ్ మేకర్స్ కు మెసేజ్ లు పాస్ చేస్తోందట. నిజంగానే ఎక్స్ పోజింగ్ విషయంలో శ్రుతిహాసన్‌ కి ఎలాంటి పరిధులు ఉండవు. నిజానికి తన కొత్త ఇన్నింగ్స్ లో శ్రుతిహాసన్‌ అక్క వదిన పాత్రలకు షిఫ్ట్ అయి, ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటున్న టైంలో బాలయ్య, మెగాస్టార్ సరసన హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ లు వచ్చాయి.

కాకపోతే శ్రుతిహాసన్‌ లో మునపటి బిగువు లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టైంలో శ్రుతిహాసన్‌ గ్లామర్ రోల్ చేసుకుంటూ వెళ్తే.. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -