బాలయ్య మెచ్చిన “అసలు’

26
- Advertisement -

వెర్సటైల్ యాక్టర్ కంటే డైరెక్టర్ గానే రవిబాబుకి మంచి పేరు ఉంది. లో బడ్జెట్ సినిమాలు తీయడంలో రవిబాబు తోపు. ముఖ్యంగా థ్రిల్లర్స్ ని రూపొందించడంలో దిట్ట. ఇపుడు రవిబాబు నుంచి మరో ఎక్సయిటింగ్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవిబాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్ ‘అసలు’. ఈ సినిమా టైటిలే డిఫరెంట్ గా ఉంది. ఐతే బాలయ్య బాబుకి ఈ అసలు సినిమా బాగా నచ్చిందట.

పూర్ణ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించగా రవిబాబు స్వయంగా కథ అందించారు. రవిబాబు రాసిన స్క్రిప్ట్ బాలయ్యకి చాలా బాగా నచ్చింది అని, ఆ మధ్య బాలయ్య ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రవిబాబు దగ్గర కూడా కొన్ని కథలు విన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య ఈ అసలు సినిమా కథను విన్నాడు. అయితే, ఆ తర్వాత బాలయ్య నిర్మాణం లేట్ అవ్వడంతో.. చివరకు ఈ సినిమా ఈటీవీ విన్ సమర్పణలో వస్తోంది.

ఇప్పటికే ఈ ‘అసలు’ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం క్యురియాసిటీని పెంచింది. ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీ ని ఛేదించడానికి పవర్ ఫుల్ కాప్ గా రవిబాబు రంగంలోకి దిగడం, ఈ కేసులో నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి హంతకుడు ఎవరు?.. ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైలర్ గ్రిప్పింగా సాగడంతో ఇప్పుడు ఈ అసలు సినిమా పై అంచనాలు పెరిగాయి. ఎంతైనా బాలయ్య లాంటి హీరోకే కథ నచ్చినప్పుడు ఇక ప్రేక్షకులకు ఎందుకు నచ్చదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -