‘ఆర్ఆర్ఆర్’ నుండి లేటెస్ట్ అప్‌డేట్..

344
Shriya Saran

హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ చితానికి దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియా భట్ తో పాటు ఓ ఇంగ్లీష్ తార కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో నటి శ్రియ కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రియ ఈ చిత్రంలో తన పాత్రపై పలు విషయాలు బయటిపెట్టింది.

శ్రియా మాట్లాడుతూ..ఈ సినిమాలో తనది అతిథి పాత్ర మాత్రమేనని.. తాను అజయ్ దేవగణ్ పక్కన కనిపిస్తానని తెలిపింది. అయినప్పటికీ రాజమౌళితో మరోసారి పనిచేయడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. రాజమౌళికి అద్భుతమైన విజన్ ఉందని, ఆర్ఆర్ఆర్ ను ఎంతో విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. రాజమౌళి ప్రత్యేకమైన విజన్ తో ముందుకు వెళుతున్నారని శ్రియ వివరించింది.సెట్స్ పై ఉన్నంత సేపు ఓ అద్భుతమైన ప్రాజెక్టులో నేను కూడా ఉన్నాననే ఫీలింగ్ కలిగేది అని పేర్కొంది.