జీవీకే గ్రాండ్ డాటర్ శ్రియా భూపాల్, అక్కినేని అఖిల్ లవ్వాయణం గురించి తెలిసిందే. వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం నుంచి మ్యారేజ్ వరకు వెళ్ళారు. కారణమేంటో గానీ..మధ్యలోనే వీరి పెళ్ళి కాన్సిల్ అయిపోయింది. దీంతో వీరి పెళ్ళి కాన్సిల్ అవడానికి కారణమేంటని సోషల్ మీడియాలో జోరుగానే వార్తలొచ్చాయి.
ఇదిలా ఉంటే.. శ్రీయాభూపాల్ కి ఓ ఎన్నారై కుర్రాడితో పెళ్లి ఫిక్స్ చేశారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ తర్వాత శ్రీయ తల్లిదండ్రులు ఓ ఎన్నారై సంబంధాన్ని ఎంపిక చేశారట. ఆ ఎన్నారై కుర్రాడిని పెళ్లాడేందుకు శ్రీయాభూపాల్ ఓకే చెప్పేసిందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని చెబుతున్నారు.
అయితే ఇప్పటివరకూ ఈ వెడ్డింగుకి సంబంధించిన ఒక్క అప్‌డేట్ కూడా బయటికి రాలేదు. కారణం ఏదైనా జీవీకే ఫ్యామిలీ ఈ వార్తని ఏమాత్రం బయటికి రాకుండా సీక్రెట్ గానే అన్నీ కానిచ్చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే శ్రీయాకు పెళ్లి నిశ్చయమైంది. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసేసుకోబోతోందని చెబుతున్నారు. నిశ్చితార్థం సీక్రెట్‌గానే, పెళ్లి కూడా సీక్రెట్‌గానే జరగనుందని చెప్పుకుంటున్నారు.
ఇక ఇదే టైంలో అఖిల్ పూర్తిగా సినీకెరీర్‌పై దృష్టి సారించాడు. మనం ఫేం విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో ఓ లాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ నటించబోతున్నాడని తెలిసింది. ఇక అఖిల్ సినిమాల మీద దృష్టి పెడుతుండగా…శ్రీయా మాత్రం సీక్రెట్‌గా పెళ్ళిపీటలు ఎక్కబోతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే పెళ్లి శుభలేఖ అందాల్సిందే.