అన్నయ్య సలహాలు పాటిస్తా..

139
Varun Tej-Srinu Vaitla Mister Movie

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే మెగా హీరోల సినిమాలు అంటే సాధారణంగా మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యామిలీ అందరినీ ఆకర్షించే సినిమాలు చేసినా.. మాస్ పల్స్ ను పట్టుకోవడంలో మెగా హీరోల తర్వాత ఎవరైనా. అయితే.. వరుణ్ తేజ్ మాత్రం డిఫరెంట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగే తొలి సినిమా నుంచి అగ్రదర్శకులతో చేసే అవకాశం దక్కించుకున్నాడు.

Varun Tej-Srinu Vaitla Mister Movie

శ్రీకాంత్ అడ్డాల.. క్రిష్.. పూరీ జగన్నాధ్.. ఇప్పుడు శ్రీను వైట్ల.. ఈ లిస్ట్ చాలు వరుణ్ ఎంత లక్కీ అనే విషయం చెప్పడానికి. అయితే.. మిస్టర్ మూవీ రిలీజ్ మాత్రం చాలా ఆలస్యం అయింది. లోఫర్ తర్వాత దాదాపు 16 నెలలు గడిచిపోయింది. ఇందుకు వరుణ్ తేజ్ కాలుకి ఫ్రాక్చర్ అవడమే కారణం. ఈ గ్యాప్ లో చరణ్ చెప్పిన విషయాలు.. సలహాలను మాత్రం మరిచిపోలేనంటున్నాడు చెర్రీ. ‘ నీ సినిమాలు ఎంత వసూలు చేశాయనే విషయం పట్టించుకోకు. మగధీర తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో.. వాటికి తగ్గట్లుగా సినిమాలు చేయాల్సి వచ్చింది. అలాంటి ట్రాప్ లో నువ్వు పడబోకు అని చరణన్న చెప్పాడు’ అంటున్నాడు వరుణ్ తేజ్.

అలాగే చిరు కూడా ఓ వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారట. ‘మా రోజుల్లో అయితే రిస్క్ లు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నీ గాయం కారణంగా.. చాలామంది అడ్జస్ట్ కావాల్సి వస్తోంది. జాగ్రత్తగా ఉండు’ అన్నారట చిరంజీవి. ఈ నెల 14న రిలీజ్ కానున్న మిస్టర్ మూవీలో.. తనకు బాగా ఇష్టమైన జోనర్ అయిన కామెడీ ఇరగదీశానంటున్నాడు వరుణ్ తేజ్.