భారతీయ రైల్వే..శ్రీ రామాయణ యాత్ర

3
- Advertisement -

భారతీయ రైల్వే…భక్తుల కోసం ప్రత్యేకంగా “శ్రీ రామాయణ యాత్ర” టూర్‌ను ప్రారంభించాయి. ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ప్రకారం టూర్ వివరాలను పరిశీలిస్తే..17 రోజుల పాటు యాత్ర ఉండనుంది.

2026 మార్చి 30న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆధునిక సదుపాయాలతో కూడిన భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది. మొత్తం సుమారు 7,560 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది.

ముఖ్య ప్రదేశాలు:

అయోధ్య (రామ్ జన్మభూమి, హనుమాన్ గఢీ)

నందిగ్రామ్, ప్రయాగ్‌రాజ్

సీతామర్హి నుంచి నేపాల్‌లోని జనకపూర్ (సీతమ్మ జన్మస్థలం)

నాసిక్ (పంచవటి), హంపి (కిష్కింధ), రామేశ్వరం

🚆 ట్రైన్ సదుపాయాలు:

ఈ ట్రైన్ “హోటల్ ఆన్ వీల్స్”లా రూపొందించబడింది.

పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు

2 ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు

షవర్ సదుపాయాలు, సెన్సార్ వాష్‌రూమ్స్

ఫుట్ మసాజర్లు

CCTV భద్రత, ప్రత్యేక సెక్యూరిటీ

టికెట్ ధరలు:

AC III టియర్ (ట్రిపుల్ షేరింగ్): ₹1,11,630

AC II టియర్ (డబుల్ షేరింగ్): ₹1,51,225

AC I టియర్ (క్యాబిన్): ₹1,64,940

Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన

ఈ ధరలో ట్రైన్ ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, శాఖాహార భోజనం, AC రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. 25% అడ్వాన్స్‌తో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఘాజియాబాద్, అలీగఢ్, టుండ్లా, కాన్పూర్, లక్నో నుంచి కూడా ఎక్కే సౌకర్యం ఉంది.

- Advertisement -