ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్లను ర్యాంక్ చేశారు.
చోప్రా విడుదల చేసిన “బ్లైండ్ ర్యాంకింగ్”లో విరాట్ కోహ్లీ చివరి స్థానంలో ఉంచడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోహ్లీ ..ఆర్సీబీ జట్టుకు 143 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి, కేవలం 66 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించాడు. 2016లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడం అతని కెప్టెన్సీలో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
ఇక గౌతమ్ గంభీర్ ను మూడో స్థానంలో ఉంచారు. గంభీర్ నాయకత్వంలో కేకేఆర్… 2012, 2014లో ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. ఆయన 129 మ్యాచ్‌లలో 71 విజయాలు సాధించడం కూడా గమనార్హం.
Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన
మొదటి రెండు స్థానాల్లో ధోని, రోహిత్ శర్మ నిలిచారు. ఈ ఇద్దరూ తమ జట్లను అనేక సార్లు విజేతలుగా నిలబెట్టిన గొప్ప నాయకులుగా గుర్తింపు పొందారు.కోహ్లీ కెప్టెన్‌గా టైటిల్ గెలవకపోయినా, 2025లో రజత్ పటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పుడు కీలక పాత్ర పోషించాడు.

