గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్రద్ధా కపూర్..

289
Shraddha Kapoor

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా కొనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.

బాహుబలి ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ శ్రద్దకు ధన్యవాదాలు తెలిపారు.