మొక్కలు నాటిన ములుగు అడిషనల్ కలెక్టర్..

54
Adarsh Surabhi IAS

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడు ములుగు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుందని కొనియాడారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు ప్రపంచ ఓజోన్ డేను పురస్కరించుకొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తన సహచర ఐఏఎస్ అధికారులు అనుదీప్ దురిశెట్టి,తేజస్ పవార్, శ్రీహర్ష కొయ్య లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.