మంత్రి కేటీఆర్ చొరవతో ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ సంస్థ షాపర్స్ స్టాప్ సిరిసిల్లలో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. శుక్రవారం ముంబైలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, షాపర్స్‌స్టాప్ ఎండీ, సీఈవో రాజీవ్‌సూరి అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూల అవకాశాలను పరిశీలించిన తరువాత అక్కడే తమ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు షాపర్స్‌స్టాప్ సంస్థ తెలిపింది.
దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన షాపర్స్‌స్టాప్ సిరిసిల్ల పట్టణానికి రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా సిరిసిల్లలో వందల మందికి ఉపాధి లభిస్తుందని… షాపర్స్‌స్టాప్ రాక.. సిరిసిల్ల అపారెల్ పార్క్ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.