కోహ్లీ బాటలోనే జడ్డూ…ఫ్యాన్స్ ఫిదా

371
jadeja
- Advertisement -

టీమిండియా ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే పయనిస్తున్నారు. కోహ్లీ దారిలోనే హార్ధిక్ పాండ్యా ప్రేమలో పడగా తాజాగా కోహ్లీ స్టైల్‌నే అనుకరించారు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. నూతన సంవత్సరం సందర్భంగా తన కొత్త స్టైలిస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు.

స్టైలిష్ లుక్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు జడేజా. ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించిన జడేజా….వైట్‌ కలర్ టోర్ జీన్స్‌తో సందడి చేశాడు. ఇక స్టైలిష్ కళ్లద్దాలతోపాటు ఖతర్నాక్ షూలు ధరించి, కిరాక్ ఫొజుతో జడేజా భలే పోస్టు పెట్టాడు. రెడీ టూ స్టార్ట్ 2020 అని క్యాప్షన్ పెట్టాడు. అభిమానులు ఈ పోస్టుపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆల్‌రౌండర్‌గా జట్టులో స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్న జడేజా ఆదివారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత జరిగే వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న జడేజా 2020లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

https://twitter.com/imjadeja/status/1213028009474699265/photo/1

- Advertisement -