తెలుగు ప్రేక్షకుల ఆదరణ..పూర్వజన్మ సుకృతం: రజనీ

503
rajinikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన రజనీ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పూర్వ జన్మ సుకృతం అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇంత పెద్ద ఫంక్షన్ అనుకోలేదని… 1976లో నా తొలి సినిమా అంతులేని కథ అప్పటినుంచి మీ అభిమానం. తమిళ వాళ్లు ఎంత ప్రేమిస్తారో తెలుగు వాళ్లు అంతే ప్రమేంచిచడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఇంతమందిని చూస్తుంటే దర్బార్ హిట్ అని తెలిసిపోతుందన్నారు. 70ఏళ్లు అయినా ఇంకా హీరోగా చూస్తున్న మీ అభిమానమే నాకు ఎనర్జీ అన్నారు. మురుగదాస్ తో సినిమా తీయాలని 15ఏళ్లుగా అనుకున్నా ఇప్పటికి కుదిరందన్నారు.

తన కెరియర్‌లో 13 సినిమాలు చేసినప్పటికీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని దర్శకుడు మురుగదాస్ తెలిపారు. రజనీకాంత్‌తో తాను చేసిన తొలి సినిమా ఇది అని అంతేగాదు తొలి పోలీస్ స్టోరీ కూడా ఇదేనని పేర్కొన్నారు.

- Advertisement -