ఫాంహౌస్‌లో జక్కన్న…ఆర్ఆర్ఆర్‌కి బ్రేక్!

29
rajamouli

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. 2021 జనవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్,ఆలియా భట్, వోవియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవలె సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చినా షూటింగ్‌లు చేసేందుకు ఎవ్వరూ ధైర్యం చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఫాంహౌజ్‌కు మకాం మార్చారట జక్కన్న. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఎదులూరు గ్రామంలో తన ఫాం హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారట. కొంతకాలం ఫాంహౌజ్ లోనే ఉంటూ స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నారట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హల్ చల్‌గా మారింది.