- Advertisement -
భర్తను నదిలో తోసిన భార్య కేసులో ట్విస్ట్. భార్య మైనర్ కావడంతో భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. కర్ణాటకలోని రాయచూర్ బ్రిడ్జిపైన సెల్ఫీ తీసుకుందామని చెప్పి, భర్తను నదిలో తోసేసింది భార్య.
నదిలో ఈదుకుంటూ ఒక రాయి వద్దకు చేరుకొని, స్థానికుల సాయంతో బ్రతికి బయటపడ్డారు భర్త తాతప్ప. అయితే భార్య మైనర్ కావడంతో బాల్యవివాహం కింద భర్త తాతప్పపై, ఆమె తల్లిదండ్రులపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
నదిలో ఈదుకుంటూ ఒక రాయి వద్దకు చేరుకున్న వ్యక్తిని గమనించి, తాడు సహాయంతో గ్రామస్తులు కాపాడిన సంగతి తెలిసిందే. ఎందుకు దూకావని అడిగిన స్థానికులకు నేను దూకలేదు నా భార్య తోసేసిందని సమాధానం ఇవ్వగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
Also Read:ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఇదే!
- Advertisement -

