కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

9
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించే అధికారాలపై ద్రౌపది ముర్ము ఇచ్చిన రిఫరెన్స్ పై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

3 నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపాలని లేదంటే వాటిని ఆమోదించినట్లుగానే భావించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రిఫరెన్స్ కోరారు రాష్ట్రపతి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.

తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని 14 కీలక ప్రశ్నలను అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు. ప్రజా ప్రయోజనంతో ముడిపడిఉన్న చట్టపరమైన అంశాలపై రాష్ట్రపతి అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ కోర్టు ముందు తన ప్రశ్నను ఉంచవచ్చని, సుప్రీం కోర్టు దానిపై విచారణ జరిపి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయవచ్చని 143(1) అధికారణం తెలియజేస్తోందని గుర్తు చేశారు.

బిల్లుల ఆమోదంపై అభిప్రాయాలని తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అలాగే తదుపరి విచారణను మంగళవారంకు వాయిదా వేసింది.

Also Read:కేటీఆర్ బర్త్ డే..కేసీఆర్‌ కిట్‌ల పంపిణీ

- Advertisement -