బిగ్ బాస్ 4…గంగవ్వ గురించి షాకింగ్ న్యూస్!

309
gangavva

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్‌ ఫుల్‌గా తొమ్మది ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. ఇక ఈ సీజన్‌లో నోయల్,లాస్య,దేవి,అమ్మ రాజశేఖర్,సూర్య కిరణ్‌ లాంటి వారు తప్ప మిగితా వారంతా కొత్త ముఖాలే. ఇక వీరిలో గంగవ్వ వెరీ వెరీ స్పెషల్. యూ ట్యూబ్ స్టార్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న గంగవ్వ బిగ్‌బాస్‌ షోలో సైతం తెలంగాణ యాసలో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.

అయితే తొలివారంలో ఎలిమినేషన్‌కు గంగవ్వ నామినేట్ కాగా అత్యధిక ఓట్లతో బయటపడింది. ఇక రెండోవారంలో కూడా గంగవ్వ ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఓటింగ్‌లో ప్రేక్షకులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. ఒకమాటలో చెప్పాలంటే ప్రస్తుతం బిగ్ హౌస్‌లో స్టార్‌గా మారిపోయింది గంగవ్వ.

ఈ నేపథ్యంలో గంగవ్వకు సంబంధించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. గంగవ్వ ప్రతివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా ఆమెను మాత్రం హౌస్‌ నుండి బయటకు వచ్చే అవకాశం లేదట. కనీసం 5 లేదా 6 వారాలైన గంగవ్వ హౌస్‌లోనే ఉండనుందట.

ఆమె హౌస్‌లో ఫైనల్‌ వరకు వెళ్తుందని అంతా భావిస్తున్న గంగవ్వ వయసు దృష్ట్యా రేటింగ్‌ వచ్చేదాక ఆమెను హౌస్‌లోనే ఉంచనున్నారట.ఇక ఇప్పటికే గంగవ్వ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గంగవ్వకు మరింత స్టార్ స్టేటస్ వచ్చేసింది. అయితే నెటిజన్లు మాత్రం గంగవ్వనే విన్నర్ కావాలని కోరుకుంటున్నారు.