పోత్గల్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేటీఆర్

224
minister ktr
- Advertisement -

పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ వెబ్ పోర్టల్ ని ఈరోజు ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. దేశంలోనే సొంత వెబ్ పోర్టల్ కలిగిన ప్రాథమిక వ్యవసాయ కోపరేటివ్ సొసైటీగా పోతుగల్ మారబోతున్నది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఈ సొసైటీ ఉన్నది.ఈ వెబ్‌సైట్‌ ద్వారా పోతుగల్ సొసైటీ తాను అందిస్తున్న రుణాలు, రుణాలకు సంబంధించిన ప్రక్రియ మరియు ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ సమాచారంతో పాటు పోతుగల్ సొసైటీ వెబ్ సైట్ ద్వారా రానున్న పెట్రోల్ బంకులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లు, ఏటీఎంలు ఆఫీస్ బిల్డింగ్‌లు వంటి తదితర వివరాలన్నింటినీ కూడా సొసైటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా ధాన్యం సేకరణ వంటి సేవల వివరాలను, గణాంకాలను సొసైటీ కి అందుబాటులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, లాకర్లు వివరాలను కూడా అందించనుంది. ఈ వెబ్‌సైట్‌ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచడం ద్వారా రైతులకు సంబంధించిన వార్తలను, సొసైటీ అందించే ఇతర  ఆఫర్లను కూడా వెబ్ సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. సొసైటీకి సొంతంగా ఒక వెబ్‌సైట్‌ని తయారు చేయడం ద్వారా దేశంలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంతటి వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చిన సొసైటీ కార్యవర్గాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.

- Advertisement -