Shobana:రెయిన్‌ సాంగ్‌ అంటే మర్డర్‌తో సమానం..

77
- Advertisement -

భాష ఏదైనా సరే సినిమా ఒకటే. హద్దులేని సినిమా రంగంలో విభిన్న భాషల్లో నటించిన నటీమణులెందరో.. వారిలో ఒకరు శోభన. శోభన నటిగానే కాదు క్లాసికల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌ ముఖ్యంగా రజినీకాంత్‌తో వర్క్‌ చేయడంపై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమిళంలో తెరకెక్కిన శివ సినిమా షూట్‌లో జరిగిన ఓ విషయాన్ని పంచుకున్నారు.

రజినీకాంత్ ఎంతోమంచి వ్యక్తి. ఆయన నిజంగా ఒక జెంటిల్‌మన్‌. మేమిద్దరం కలిసి శివ దళపతి సినిమాల్లో నటించాం. కానీ శివ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన నాకెంతో సాయం చేశారు. ఓ సారి మా ఇద్దరిపై వర్షం పాట చిత్రీకరించడానికి సెట్‌ వేశారు. సెట్స్‌లో ఉన్న వారందరికీ ఆ విషయం తెలుసు. నాకు తప్ప అని చెప్పుకొచ్చారు. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి కట్టుకోమన్నారు. దీంతో ఆ కాస్ట్యూమ్‌ చూడగానే రెయిన్‌సాంగ్ అని అర్థమైంది. దాంతో కాస్ట్యూమ్‌ బాయ్‌ని పిలిచి…ఈ చీర బాగా పల్చగా ఉంది…ఇంటికి వెళ్లి..శరీరం కనిపించకుండా ఉండేందుకు ఏదైనా ధరించి దానిపై చీర కట్టుకుని వస్తా అని చెప్పాననే ఈ విషయం వెల్లడించింది. అయితే షూట్‌ మొదలు కావడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో స్టూడియోలో ఉన్న ఓ టేబుల్‌ కవర్‌ని ఒంటికి చుట్టుకుని సాంగ్‌ షూట్‌లో పాల్గొన్న అని తెలిపింది.

అయితే ఈ సందర్భంగా రజనీకాంత్‌ కవర్ వల్ల వచ్చిన సౌండ్‌కు ఇబ్బందిపడ్డారు. కానీ ఆయన ఏమీ అనలేదు. ఆరోజు నేను టేబుల్‌ కవర్‌ ధరించానని ఎవరికీ తెలియదు. నాకు తెలిసి రెయిన్‌ సాంగ్‌ అంటే హీరోయిన్స్‌ను మర్డర్‌ చేసినట్టే..ఎందుకంటే చివరి వరకూ వాళ్లకు ఆ విషయం తెలియదు అని శోభన చెప్పుకొచ్చారు. మొత్తమీద శోభన చేసిన విషయాన్ని రజినీకాంత్‌ కూడా ఎవరికీ చెప్పలేదని అన్నారు.

ఇవి కూడా చదవండి…

రాజమౌళి ఒక సినిమా స్కూల్‌ :ఆలియా

ఒక్క హిట్ తో ఎక్కడికో వెళ్ళింది

8A.M.మెట్రో లాంచ్ బై గుల్జార్..

- Advertisement -