మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి వచ్చింది. తనతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ ఇస్తానని ఓ వ్యక్తి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడని బుల్లితెర నటి శివ్యా పఠానియా తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ….హమ్ సఫర్ షో అయిపోయాక ఛాన్సులు రాలేదు. ఏం చేయాలో తెలీలేదు. చాలా రోజులు ఖాళీగానే ఉన్నానని తెలిపింది.
ఆ సమయంలో ఎవరు ఆడిషన్స్‌కి పిలిచిన వెళ్లే దానినని అందులో భాగంగా ఓ ఆఫీస్ నుండి ఆడిషన్‌కి రమ్మంటే వెళ్లానని తెలిపింది. ఒక చిన్న గది, లోపల ఓ వ్యక్తి ఆడిషన్ తీసుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్ అయితే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు. ఆ సమయంలో అతడు హనుమాన్ చాలీసా వింటున్నాడు. కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావు అని తిట్టానని తెలిపింది శివ్యా.
హమ్ సఫర్ షో, లాల్ ఇష్క్, రాధాకృష్ణ లాంటి పలు టీవీ సిరీస్ లతో అక్కడి ప్రేక్షకులకి దగ్గరైంది శివ్యా . రాధా, సీత, లక్ష్మి, పార్వతి ఇలా ఎక్కువగా దేవతల రోల్స్ వేసి ప్రేక్షకులకి బాగా దగ్గరైంది.