కరోనా మృతుల కుటుంబాలకు రూ.లక్ష సాయం…

32
shivraj

కరోనా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధికసాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఎమ్మెల్యేలతో వీడియో కాన్పరెన్స్ అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు శివరాజ్.

క‌రోనా వ‌ల్ల త‌మ వారిని కోల్పోయిన లోటును పూడ్చ లేనిద‌ని, ఆ బాధ‌ల‌లో ఉన్న‌వారికి కొంత ఉప‌ష‌మ‌నం క‌లిగించాల‌ని నిర్ణ‌యించామ‌ని సీఎం అన్నారు. ఇందులో భాగంగా వారికి కొంత‌మేర‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెప్పారు.

క‌రోనా బారిన‌ప‌డినవారిని కాపాడాల‌ని తాము ప్ర‌య‌త్నించాం. కానీ ర‌క్షించ‌లేక‌పోయాం. అందువ‌ల్ల వారిని వారి కుటుంబాల‌కు రూ.ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం ఇస్తుమ‌ని వెల్ల‌డించారు.