ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు…

36
ap highcourt

ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఇటీవల నిర్వహించిన ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పునివ్వడంతో పాటు ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.