మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మధ్యప్రదేశ్ రోడ్లను అమెరికా రోడ్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలకు చౌహాన్ అభివాదం చేస్తూ.. ఐ లవ్యూ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘మామాజీ.. ఐ టూ లవ్యూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చౌహాన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వైరల్‌గా మారింది.
ఇక గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పలు బహిరంగ సభల్లో ప్రజలకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే స్టైల్‌ని ఆయన తనయుడు జగన్ అనుకరించబోగా విచిత్ర అనుభవం ఎదురైన ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఓ యాత్రలో జగన్ ఓ బామ్మ నుదుటిపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా అవాక్కయ్యే విధంగా జగన్నే దగ్గరికి తీసుకుని పెదాలపై ముద్దాడేసింది. పక్కన ఉన్న బాడీ గార్డులు ఆ అమ్మను లాగేయాలని ప్రయత్నించినప్పటికీ ఉడుం పట్టుతో జగన్‌ను దగ్గరకు తీసుకుంది. ఈ ఘటనతో జగన్ షాక్ తిన్నాడు. తాజాగా శివరాజ్‌కు అలాంటి చేదు అనుభవం ఎదురుకాకపోయిన ఫ్లయింగ్ కిస్‌తో మరోసారి వైఎస్సార్ ఫ్యామిలీని గుర్తుచేశాడు.
MP CM Shivraj Singh Chouhan blows a kiss to some man yelling "mamaji, I love you". pic.twitter.com/gaweqqB4Mo
— Mahim Pratap Singh (@mayhempsingh) October 31, 2017