ఓటు హక్కువినియోగించుకున్న చౌహాన్..

255
shivraj singh chouhan
- Advertisement -

2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌, మిజోరంలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ బుధవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభంకాగా సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

మధ్యప్రదేవ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యప్రదేశ్‌, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు.

- Advertisement -