తెలుగు హీరోయిన్లు బోల్డ్ బాట పట్టారండోయ్

36
- Advertisement -

శివాత్మిక.. హీరో రాజశేఖర్ కూతురు. పైగా ఆమె నిర్మాత కూడా. గతంలో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే మరియు కల్కి సినిమాలకు నిర్మాతగా ఆమె పడింది. ఇక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా శివాత్మిక హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మంచి నటి అని పేరు తెచ్చుకుంది. కానీ ఎందుకో.. శివాత్మిక కు కాలం కలిసి రాలేదు, నిజానికి తెలుగు సినిమాలు పలువురు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్న మాట నిజమే. కానీ వారికి వస్తున్న అవకాశాలు అంతంతమాత్రమే. ఒక్క శ్రీలీల మాత్రమే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉంది. మరి మిగతా తెలుగు అమ్మాయిల పరిస్థితి ఏమిటి ?, ఏమీ బాగాలేదు. ఈషా రెబ్బా లాంటి భామలు ఛాన్స్ ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక మరి కొందరు తెలుగు భామలు కేవలం చిన్న చిత్రాలతో సరిపెడుతున్నారు. అలాంటి తెలుగు భామల లిస్ట్ లోకే వస్తోంది శివాత్మిక. ఎలాగైనా మంచి సినిమాల్లో ఛాన్స్ లు పట్టడం కోసం శివాత్మిక గ్లామర్ బాట కూడా పట్టింది. ఇటీవల ఈ భామ గ్లామర్ ఫోటోషూట్లు కూడా ఎక్కువే చేస్తోంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామకి ఇలాంటివి అవసరమా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. దానికి శివాత్మిక సమాధానం చాలా బోల్డ్ గా ఉంది. “హీరోయిన్ లో అందరూ చూసేది షేప్ లే కదా. అయినా హీరోయిన్ అన్నాక బోల్డ్ ఫోటోషూట్లు చెయ్యక తప్పదు అని శివాత్మిక చెప్పుకొచ్చింది.

శివాత్మిక ఇంకా మాట్లాడుతూ.. ‘వేరే భాషలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ తోనే హీరోయిన్ గా నెట్టుకొస్తున్నప్పుడు తెలుగు అమ్మాయిలు ఎందుకు ఎక్స్ పోజింగ్ చేయకూడదు అని శివాత్మిక ఎదురు ప్రశ్నిస్తోంది. హీరోయిన్ అనన్య నాగళ్ళ కూడా ‘పోటీ తట్టుకోవాలి అంటే.. బోల్డ్ లుక్స్ తప్పవు. సర్దుకుపోవాలి అంతే,” అని నిజం మాట్లాడింది. మొత్తానికి తెలుగు హీరోయిన్లు బోల్డ్ బాట పట్టారు.

Also Read:జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!

- Advertisement -