ఎంపీ నవనీత్‌కు మరో షాకిచ్చిన శివసేన!

40
mp
- Advertisement -

అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాకిచ్చింది శివసేన. హనుమాన్ చాలీసా వివాదంతో శివసేన – నవనీత్ కౌర్ దంపతులకు గ్యాప్ పెరుగగా వీరిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇటీవలె వీరు బెయిల్‌పై రాగా తాజాగా ముంబైలోని ఖేర్ ప్రాంతంలోని ప్లాట్ లో కొంతభాగం అక్రమంగా నిర్మించుకున్నారని, దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని ముంబయి నగర పాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

వారం రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించింది.అంతేకాక ఇంటి యజమానికి నెలరోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా తెలిపారు అధికారులు. దీంతో ఈ వివాదంపై వీరు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..

- Advertisement -